- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవరకొండ లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత
దేవరకొండలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 20 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు ఎమ్మెల్యే బాలు నాయక్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేత.

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 20 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు ఎమ్మెల్యే బాలు నాయక్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి స్పష్టమైన దృష్టి కోణంతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదాలతో ఈ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ సమన్వయంతో పని చేసి ప్రజల మద్దతు పొందాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. దేవరకొండ మున్సిపాలిటీలో వందశాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని, చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎలాగైతే కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారో, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీలకు ఇచ్చే ప్రతి హామీని నెరవేర్చి, అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వార్డు సభ్యుల పేర్లు:
1. పొన్నబోయిన భూదేవి- సైదులు (వార్డు 1)
2. అంకూరి శివ ప్రసాద్ (వార్డు 2)
3. అంకురి సుమలత - రాజేష్ (వార్డు 3)
4. మహ్మద్ రయీస్ (వార్డు 4)
5. గోవిందు పద్మ - జగతయ్య (వార్డు 5)
6. ఎం.డి. యూనుస్ (వార్డు 6)
7. హన్మంతు సాయి చంద్ర గౌడ్ (వార్డు 7)
8. కేతావత్ అజయ్ (వార్డు 8)
9. నలగాసు మంగ - విజయ్ యాదవ్ (వార్డు 9)
10. గుద్దేటి మాధవి - సత్యనారాయణ (వార్డు 10)
11. షేక్ నవీద్ (వార్డు 11)
12. బిజిలి అంకులమ్మ - యాదయ్య (వార్డు 12)
13. పులిజాల చందన- ఆదిత్య (వార్డు 13)
14. గాజుల సావిత్రి - మురళి (వార్డు 14)
15. జువేరియా తబస్సుం - మహమ్మద్ నవాజ్ అహ్మద్ (వార్డు 15)
16. ముడావత్ జయప్రకాష్(జేపీ) (వార్డు 16)
17. ఏకుల కరుణాకర్ (వార్డు 17)
18. ఉప్పల శ్రీనివాసులు (వార్డు 18)
19. పున్న శైలజ వెంకటేశ్వర్లు (చైర్ పర్సన్ అభ్యర్థి, వార్డు 20)






