చౌటుప్పల్‌లో బీ-ఫామ్ గందరగోళం

by Ratna Kumari |

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్‌ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

చౌటుప్పల్‌లో బీ-ఫామ్ గందరగోళం
X

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీ-ఫామ్‌ల సమర్పణ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా భావించిన చింతల ఉమా మహేశ్వరి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరపున బీ-ఫామ్ సమర్పించడం రాజకీయంగా కలకలం రేపింది. ఇంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను తప్పించడంతో పాటు, ఉమా మహేశ్వరికి కాంగ్రెస్ బీ-ఫామ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేశారంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగి జోక్యం చేసుకున్నారు.

Next Story