- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళపై హత్యాయత్నం
మండలంలో ఓ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేసిన ఘటన చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది.

దిశ, చిలుకూరు : మండలంలో ఓ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేసిన ఘటన చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపురానికి చెందిన దొంగరి సంధ్య ఇటీవల తన తల్లిగారి ఊరైన ఆర్లెగూడేనికి వచ్చింది. ఆమె సోమవారం ఊరిలోని తమ పొలానికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన ఆరె సైదాబాబు హఠాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరి కుటుంబాలకు ఇటీవల కొంతకాలంగా
పొలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. ఆ తగాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. గాయాలపాలైన సంధ్యను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఆరె బసవయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సురభి రాంబాబు మంగళవారం కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు సైదాబాబు ఇటీవల తన సొంత పెద్దమ్మను స్కూటర్ తో ఢీకొట్టి తీవ్ర గాయాలపాలుజేశాడు. సంవత్సరం క్రితం గ్రామంలోని పశువుల కాపరుల ఆవుపై కూడా గడ్డపారతో దాడి చేశాడని స్థానికులు పేర్కొన్నారు.
- Tags
- Attempted murder






