- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
మొయినాబాద్ లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను రామన్నపేట బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

దిశ, రామన్నపేట : మొయినాబాద్ లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను రామన్నపేట బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. న్యాయవాది మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ మజీద్ డిమాండ్ చేశారు. నిరంతరం అడ్వకేట్ లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమని అన్నారు. ఆస్తి వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించాలని కోరారు. ఈ సందర్భంగా యువ న్యాయవాది స్వప్న మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ఆత్మశాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య , సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ పాల్గొన్నారు.






