- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత కక్షలతో వ్యక్తిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి
by Taduka Kalyani |
పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కర్రతో దాడి చేయగా, ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, మునగాల: పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కర్రతో దాడి చేయగా, ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలమర్రి గ్రామానికి చెందిన బచ్చలకూర మదార్(52) పై అదే గ్రామానికి చెందిన బచ్చలకూర సంజీవ్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16వ తేదీన మదార్ పై కర్రతో దాడి చేయగా తీవ్ర గాయాలైన మదార్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






