- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపులు తాళలేక బావిలోకి దూకిన వివాహిత
భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

దిశ,ఆత్మకూరు(ఎం): భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం ) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె రాములు, మారెమ్మ దంపతులకు ముగ్గురు కుమా రులు. చిన్న కుమారుడు కటికె కృష్ణకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామా నికి చెందిన కేమెడీ బైరయ్య, జయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె సంధ్యతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వివాహానికి ముందు కృష్ణ హైద రాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పనిచే సేవాడు. వివాహం తర్వాత గ్రామంలోనే వ్యవ సాయం చేసుకుంటూ ఉన్నాడు. ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతు న్నాయి. ఈ క్రమంలో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో సంధ్యపై కృష్ణ, జనగామ జిల్లా రఘునాథ పల్లి పోలీస్ స్టేషన్లో కృష్ణపై సంధ్య పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో జీవతంపై విరక్తి చెందిన సంధ్య ఆదివారం సాయంత్రం ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో సిద్ధాపురం రోడ్డు పక్కన వ్యవసాయ బావిలో దూకింది. సమీపంలో మామిడి చెట్టుకు కాపలాగా ఉన్న కుర్రాడు చూసి చుట్టుపక్కల వారికి సమామాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. బావి గట్టుపై ఆధార్ కార్డు, చెప్పుల జత, సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైరింజన్ సహాయంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తోడి సోమవారం మృతదేహాన్ని బయటకు తీసి,పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రి కి తరలించారు.తనను భర్త కృష్ణతో పాటు అత్త, మామ, బావ, తోటికోడలు వేధిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్క పోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్య సూసైడ్ నోటు లో దొంగతనం చేశావంటూ తన భర్త కృష్ణ ఆత్మకూర్ స్టేషన్ లో కేసు పెట్టాడని యువతి సూసైడ్ నోట్ లో తెలిపింది. చోరీ చేసినట్టు ఒప్పుకోవాలని పోలీసులు తనను ఒత్తిడి చేసి ఇబ్బందులు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్థులు పోలీస్ స్టేషన్లో ఆందోళన చేశారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.






