- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోతున్నానని వీడియో కాల్.. రక్షించిన పోలీసులు
కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించగా, లొకేషన్ ఆధారంగా రక్షించి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం మండలం అడివెంలలో శుక్రవారం సాయంత్రం జరిగింది.

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించగా, లొకేషన్ ఆధారంగా రక్షించి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం మండలం అడివెంలలో శుక్రవారం సాయంత్రం జరిగింది. అర్వపల్లి ఎస్ఐ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి పురుగుమందు తాగి చనిపోతున్నానని బంధువులకు ఫోన్ చేశాడు.
వెంటనే స్పందించిన బంధువులు డయల్ 100 కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపినారు. దీనిపై అర్వపల్లి ఎస్ఐ, సిబ్బంది త్వరితగతిన స్పందించి ఫొన్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి ప్రాణాలతో రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు, ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ చేసి పంపించారు. త్వరితగతిన స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసుల స్పందన పట్ల, పోలీసు విధుల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారని ఎస్సై తెలిపారు.






