గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

by Naveena |

అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ కుమారస్వామి తెలిపారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కొంతమంది వ్యక్తులు గంజాయి తరలిస్తునే పక్క సమాచారంతో.. జగదేవపూర్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ఒక కారును ఆపి తనిఖీ చేయడంతో అందులో 24 ప్యాకెట్స్ గంజాయి దొరికాయి. అందులో 51.13 కేజీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కారులో ఉన్న ఈషన్నపురం గ్రామం, సంగారెడ్డి మండలానికి చెందిన మహమ్మద్ ఆమిర్, ముషీరాబాద్ కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ కు చెందిన భాషా పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ గంజాయిని నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరుకు నుంచి పటాన్ చెరువు, సంగారెడ్డి కు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Next Story