బైక్ దొంగల అరెస్టు

by Nallavelli.Anjaneyulu |

మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7లక్షల విలువైన ఎనిమిది బైకులు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

బైక్ దొంగల అరెస్టు
X

దిశ, నల్లగొండ క్రైం : మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7లక్షల విలువైన ఎనిమిది బైకులు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీపీవోలో అదనపు ఎస్పీ మంగళవారం మీడియాకు వెల్ల‌డించారు. చండూరులోని హనుమానగర్ కు చెందిన పగిళ్ల శివ కుమార్ రెండోసంవత్సరం చదవగా.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన అలుగలు వంశీ కృష్ణ కెమరా మెన్ గా పని చేస్తున్నాడు. ఇరువురు గతంలో వేర్వేరుగా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లారు. అక్కడ ఇరువురు స్నేహితులుగా మారి, బయటకు వచ్చాక కూడా బైకులను దొంగతనాలు చేస్తున్నారు. గత డిసెంబర్ 16 ఏపీలోని కడప జిల్లాకు చెందింది. పల్లెం నరసయ్య బైక్ పై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ.. కేతేపల్లి గ్రామంలోని సాయి కృష్ణ హోటల్ వద్ద రాత్రి నిద్ర రావడంతో హోటల్ ఆవరణలో బైక్ పార్క్ చేసి నిద్రించాడు. మరుసటి రోజు తెల్లవారు జామున లేచి చూడగా బైక్ కనిపించలేదు. కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం తెల్లవారు జామున‌ కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కేతేపల్లి ఎస్‌ఐ సిబ్బంది తనిఖీ చేస్తుండగా.. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు విజయవాడ వైపు వస్తూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పగిళ్ల శివ కుమార్, ఇద్దరు బాల నేరస్తులు నల్లగొండలోని ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారని, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. పగిళ్ల శివ కుమార్ గతంలో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక హత్య కేసులో చర్లపల్లి జైలుకు వెళ్లగా, అక్కడ పరిచయమైన, అలుగలు వంశీ కృష్ణతో కలిసి, కేతేపల్లి, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ హైదరాబాద్‌లోని పెట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో డీఎస్ శివరాంరెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, సీసీఎస్ సీఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, కేతేపల్లి ఎస్‌.ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, వాహీద్, పుష్ప గిరి, సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.

Next Story