- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనుమల మండలంలో ఆదివారం జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

దిశ, హాలియా: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనుమల మండలంలో ఆదివారం జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 24 గ్రామపంచాయతీలకు గాను నాలుగు గ్రామపంచాయతీలు పంగవానికుంట తండా, శ్రీనాధపురం, కాశవారిగూడెం, నాయుడుపాలెం గ్రామాలకు మినహా 20 గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికలతో పాటు 196 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. కాగా తిమ్మాపురం గ్రామంలో కేవలం సర్పంచి అభ్యర్థి కోసం ఎన్నిక నిర్వహిస్తున్నారు. శ్రీనాథపురంలో కేవలం రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే అధికారులు సిబ్బందితో సహా సామాగ్రిని చేరవేశారు. 20 గ్రామాల సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థుల కోసం మొత్తం 64 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 196 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు గాను 362 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇందులో పీఓ, ఓపీఓలు 332 మంది కాగా జోనల్ అధికారులు 7 గురు ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 80 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. వీటితో పాటు 50 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు. ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన అధికారులు పోలీస్ బందోబస్తు కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు.
- Tags
- nalgonda






