గిరిజ‌న ఉప స‌ర్పంచ్ ల జిల్లా క‌మిటీ నియామ‌కం

by Ratna Kumari |   (  Updated:2026-01-28 09:23:54  IST  )

సూర్యాపేట జిల్లా గిరిజ‌న ఉప స‌ర్పంచ్ ల క‌మిటీని బుధ‌వారం నియ‌మించారు. జిల్లా అధ్య‌క్షులుగా బానోత్ ర‌వితేజ నాయ‌క్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అనిల్ నాయ‌క్ నియామ‌క‌మ‌య్యారు.

గిరిజ‌న ఉప స‌ర్పంచ్ ల జిల్లా క‌మిటీ నియామ‌కం
X

దిశ‌, చెవ్వెంల‌ / సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ సంఘం కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా గిరిజన ఉపసర్పంచుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉప సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్ హాజ‌ర‌య్యారు. అనంతరం సూర్యాపేట జిల్లా కమిటీని అధికారికంగా నియమించారు. సూర్యాపేట జిల్లా గిరిజన ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా బానోత్ రవితేజ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్ నాయక్ ని నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధి, ఉప సర్పంచుల హక్కుల సాధన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు సక్రమంగా అందేలా జిల్లా కమిటీ సమిష్టిగా పని చేయాలని సూచించారు. నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ బాలు నాయక్ , నాయకులు హరీష్ నాయక్ , నరసింహ నాయక్, నాగు నాయక్, గిరిజన ఉప సర్పంచ్ సంఘం నాయకులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.

Next Story