- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్నివీర్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలమేరకు ఆసక్తిగల ఇంటర్మీడియట్ విద్యార్థులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు.

దిశ,వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలమేరకు ఆసక్తిగల ఇంటర్మీడియట్ విద్యార్థులు అగ్నిపథ్ ,అగ్ని వీర్, www.joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. అగ్నిపథ్ - అగ్ని వీర్,అర్ టజి 2025-26 నియామక ప్రక్రియకు మార్చి 12వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైందని,అగ్నివీర్ జనరల్ డ్యూటీ,అగ్నివీర్ టెక్నికల్,అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్,అగ్నివీర్ ట్రేడ్స్ మెన్, వంటి వివిధ కేటగిరీలలో నియామకాలు నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి పదవ తరగతి లో 45 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు.
అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ విభాగంలో 50 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. అగ్నివీర్ క్లర్క్ కేటగిరి కింద ఇంటర్మీడియట్ లో ఏదైనా గ్రూపు నుండి 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కింద 60 శాతం మార్కులతో పదవ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అగ్ని వీర్ రిక్రూట్మెంట్లో పాల్గొనే విద్యార్థుల వయస్సు 17 1/2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు ఉండాలన్నారు. ఈ నియామక ప్రక్రియ రెండు ఫేజ్ లలో ఉంటుందని, మొదటి ఫేజ్ లో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుందన్నారు. రెండవ ఫేజ్ లో రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందన్నారు. ర్యాలీ లో రన్నింగ్,శారీరక పరీక్షలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు .దరఖాస్తు చేసుకోవడానికి 250 రూపాయల రుసుము ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష జూన్ లో నిర్వహించబడుతుందని, అగ్నివీర్ నియామకాలు పూర్తిగా మెరిట్ బేస్ పై ఆధారపడినిర్వహించబడుతాయన్నారు.






