Minister Vasamsetti Subhash : మీ చొరవ వల్ల ఆంధ్ర,తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి

by Chintha Aamani |   (  Updated:2024-10-26 09:21:07  IST  )

బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో

Minister Vasamsetti Subhash  : మీ చొరవ వల్ల ఆంధ్ర,తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడ్డాయి
X

దిశ,నల్లగొండ: బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) మర్యాదపూర్వకంగా కలిశారు.ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితుల తో పాటు రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి, ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్దీకరణ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ కి వివరించగా ఆంధ్రప్రదేశ్ తో అనుసంధానించే ఎన్.హెచ్-65 విషయంలో మీరు చూపిన చొరవ వల్ల ఆంధ్ర, తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Read More : మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

Next Story