- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం మీదికి తెచ్చిన "లిఫ్ట్"
వాహనంలో వెళ్తున్న వ్యక్తికి మరో వ్యక్తి లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పైనే దాడికి దిగిన సంఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.

దిశ, చిట్యాల : వాహనంలో వెళ్తున్న వ్యక్తికి మరో వ్యక్తి లిఫ్ట్ అడిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పైనే దాడికి దిగిన సంఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో మంగళవారం జాతీయ రహదారి 65 పై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన కారులో హైదరాబాద్ కి వెళుతుండగా.. నార్కట్ పల్లి సమీపంలో ఒక వ్యక్తి వాహనాన్ని లిఫ్ట్ అడిగి కారులో ఎక్కాడు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలోకి రాగానే కారులో లిఫ్ట్ అడిగిన వ్యక్తి ఒక్కసారిగా ఇమ్రాన్ పై కత్తితో దాడి చేశాడు. తనపై ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇమ్రాన్ పై కత్తిగాట్లు పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ఇమ్రాన్ దుండగుడిని ఎదిరించాడు. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో దుండగుడు ఒకసారిగా కారు దిగి పారిపోయాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకొని చూడగా.. ఇమ్రాన్ పై కత్తిగాట్లు ఉండడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చిట్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితున్ని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. దాడి చేసిన వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాస్తవమా? కట్టుకథ..?
సినీ పక్కిలో జరిగిన ఈ సంఘటన వాస్తవమా లేదంటే కట్టు కథనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తి, గాయపడిన వ్యక్తి వాస్తవంగా ఎలాంటి పరిచయం లేని వ్యక్తులేనా? లేదంటే గతంలో ఏమైనా ఇద్దరూ కలిసి వ్యాపార లావాదేవీలు చేసి విభేదాలు రావడంతో ఒకరిపై మరొకరు చేసుకున్న దాడినా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన సంఘటన అయినప్పటికీ ఇప్పటికీ బాధితుని పక్షాన ఎవరు కూడా వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం పట్ల పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






