విద్యార్థి మర్మాంగంపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

by Naveena |

నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిప్పర్తి తెలంగాణా సోషల్ వెల్ఫైర్ గురుకుల బాలుర పాఠశాల ప్రతి సారి వార్తల్లోకి ఎక్కుతున్న వైనం అందరికి తెలిసిందే.

విద్యార్థి మర్మాంగంపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిప్పర్తి తెలంగాణా సోషల్ వెల్ఫైర్ గురుకుల బాలుర పాఠశాల ప్రతి సారి వార్తల్లోకి ఎక్కుతున్న వైనం అందరికి తెలిసిందే. గతంలో లో పరీక్ష కేంద్రం వద్ద ఇదే పాఠశాలకు చెందిన ఓ పదవ తరగతి విద్యార్థి మీద దాడి బయట వ్యక్తులు చేస్తే ప్రిన్సిపాల్ సునీత డీల్ చేసిన విషయం తెలిసిందే. అది మరువక ముందే చరణ్ తేజ్ 7వ తరగతికి చెందిన విద్యార్థి పై అదే పాఠశాలకు చెందిన తన సహచర విద్యార్థి రోల్ కాల్ పేరున తన మోకాలు తో బలంగా తన మర్మాంగం మీద తన్నడం జరిగింది. దీంతో ఆసుపత్రికి తరలించిన విద్యార్థి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడు. వారి తల్లితండ్రులకు సమాచారం తెలియడంతో.. విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలో కూడా ఇదే విద్యార్థి మీద రవీందర్ అనే టీచర్ కొట్టడంతో తలకు గాయమైంది. అయితే ప్రిన్సిపాల్ అందుబాటులో లేకుండా ఉండటమే కారణం అని విద్యార్థులను గాలికి వదిలేసి ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నట్లు ఆ విద్యార్థి తల్లి తండ్రులు వాపోయారు.

మా బాధ్యత ఆసుపత్రికి తరలించడం మాత్రమే:ప్రిన్సిపాల్ సునీత

ఇదే విషయమై ప్రిన్సిపాల్ సునీతని దిశ కాల్ లో వివరణ కోరగా.. చాలా అసమర్థమైన సమాధానం తెలిపారు. విద్యార్థిని కొట్టిన విషయం మాకు తెలిసింది. ఆసుపత్రికి పంపడం వరకు మాత్రమే మా బాధ్యత అని అన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థిని అప్పగించినట్లు కొట్టిన సదరు విద్యార్థితో లెటర్ రాపించినట్లు తెలిపారు.

Next Story