- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1987 నుంచి 1991 చదువుకున్న విద్యార్థులు

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1987 నుంచి 1991 చదువుకున్న విద్యార్థులు నల్గొండ పట్టణంలోని ఎంఎంఆర్ కన్వెన్షన్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించుకొన్నారు. చదువు చెప్పిన పూర్వ ఉపాధ్యాయులను, స్కూల్ హెడ్మాస్టర్ సోమేశ్వర రావు, ముత్యంరెడ్డి, మోహన్ రెడ్డి. పాండు రంగయ్య, సత్యనారాయణ రెడ్డి, సాంబయ్యను పూలదండలు, శాలువాలతో సత్కరించీ సన్మానం చేసారు. 35 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే దగ్గర కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, పాల్గొన్న విద్యార్థులు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు. సోమేశ్వర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ వివిధ స్థాయిలో స్థిరపడి మంచి హోదాలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరపాక నాగయ్య. గోవర్ధన చారి, అవుట రవీందర్, జన్నారెడ్డి, ఎస్.కె మజీద్, వెన్నమల్ల రమేష్ బాబు, ఇంద్రసేనారెడ్డి, పి.రఘు, రేఖల బాలస్వామి, సుజాత, వనజ, యాదమ్మ, పూలమ్మ, లక్ష్మీబాయి, వరలక్ష్మి, పద్మ, లక్ష్మి, మంజుల, శశికళ, అండాలు, సైదమ్మ పాల్గొన్నారు.






