- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Breaking: కుప్పకూలిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ పైకప్పు..కార్మికులకు గాయాలు..!
Breaking: కుప్పకూలిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ పైకప్పు..కార్మికులకు గాయాలు..!
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది...

X
దిశ, నాగార్జునసాగర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేరకు పై కప్పు కుంగిందని టన్నెల్ బోరింగ్ మిషన్‌కు సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలోనే టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఐదారుగురు కూలీలు ఉన్నారని చెప్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను తవ్వుతూ దానికి సమాంతరంగా లైనింగ్ పనులు చేస్తుంటారు. టన్నెల్ బోరింగ్ మిషన్ రిపేర్ల కారణంగా కొన్నాళ్లుగా పనులు చేయడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ ఎడమ వైపు టన్నెల్ 14వ కి.మీ.ల వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయిదని చెప్తున్నారు. సిమెంట్ లైనింగ్ చేసిన భాగం ఎలా కూలిందనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఒక్కసారి కుప్ప కూలడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






