ఆమరణ దీక్ష విరమించిన చేనేత కార్మికులు

by Ratna Kumari |

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు రుణమాఫీ కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం సాయంత్రం విరమించారు.

ఆమరణ దీక్ష విరమించిన చేనేత కార్మికులు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు రుణమాఫీ కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం సాయంత్రం విరమించారు. చేనేత జోలి శాఖ ఆర్డిడి పద్మ గతంలో విడుదలైన రూ.33 కోట్లకు అదనంగా మంగళవారం 16 కోట్ల 40 లక్షల చేనేత రుణమాఫీకి సంబంధించిన ప్రోసిడింగ్ కాఫీని దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు చూయించి విరమింప చేశారు. ఇప్పటికే చేనేత రుణమాఫీ కోసం ప్రొసీడింగ్స్ విడుదల చేశామని త్వరలోనే అందుకు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమవుతాయని ఉన్నతాధికారులు వారిని ఒప్పించారు. దీంతో పూర్తిగా చేనేత రుణమాఫీ విడుదల కావడంతో రెండు రోజులుగా దీక్ష చేస్తున్న కార్మికులు దీక్ష విరమించడంతో కథ సుఖాంతం అయింది. దీక్షలో పాల్గొన్న వర్కర్లు వెంకటేశం, బాలరాజు, రాజకుమారులు దీక్ష విరమించి సంతోషం వ్యక్తం చేశారు.

Next Story