- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ లైన్ మెన్, హెల్పర్ లేకుండా ప్రైవేట్ వ్యక్తికి అన్ని బాధ్యతలు
మేళ్లచెరువు మండలంలో విద్యుత్ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి.

దిశ, మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలో విద్యుత్ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా మేళ్లచెరువు టౌన్‌లో కరెంటు కష్టాలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. “ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉండాలన్నదే ప్రభుత్వ విధానమా?” అనే ప్రశ్న ఇప్పుడు వినియోగదారుల్లో మారుమోగుతోంది. మండలంలో మొత్తం 16 గ్రామపంచాయతీలు ఉండగా.. కందిబండ, రామాపురం, హెచ్ఎం తండా పరిధిలో లైన్మెన్లు ఉన్నప్పటికీ వారు స్థానికంగా అందుబాటులో ఉండరని ఆరోపణలు ఉన్నాయి దీనితో కరెంటు పనులు సక్రమంగా సాగడం లేదు. కానీ అసలు సమస్య మేళ్లచెరువు టౌన్‌లోనే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు టౌన్ పరిధిలో సుమారు 40 ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి. ఇవే కాకుండా రైస్ మిల్లులు, కర్ర కోత మిషన్లు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ బ్యాంకు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, ఇవి కాకుండా దాపు 7000 గృహ విద్యుత్ కనెక్షన్లు, అలాగే మాదారం, వెంకట్రాంపురం, కందిబండ గ్రామాలకు వెళ్లే సబ్ లైన్లు, వ్యవసాయ మోటార్లకు సరఫరా కూడా ఇదే టౌన్ మీద ఆధారపడి ఉంది.
మేళ్ల చెరువు టౌన్ కరెంట్ ప్రైవేట్ వ్యక్తి చేతికి..
ఇంత భారీ బాధ్యత ఉన్న మండల కేంద్రానికి ప్రభుత్వ విద్యుత్ లైన్ మెన్ , అసిస్టెంట్ లైన్ మెన్ హెల్పర్ కూడా లేకుండా 6 నెలలుగా ప్రైవేటు వ్యక్తితో వినియోగదారుల ఇబ్బందులు గురి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. మండల కేంద్రంలో కనీసం ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు లైన్మెన్లు, ఇద్దరు అసిస్టెంట్ లైన్మెన్లు ఉండాల్సి ఉన్నా, గత 6 నెలలుగా ఒక్క ప్రభుత్వ హెల్పర్, లైన్మెన్ లేకుండానే విద్యుత్ శాఖ పనులు కొనసాగించటం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..? ప్రభుత్వ వ్యవస్థను ఒక ప్రైవేట్ టెక్నీషియన్ చేతుల్లో పెట్టి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఎవరి అనుమతితో జరుగుతోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 40 ట్రాన్స్ పర్ పరిధిలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడి టౌన్ మొత్తం కరెంటు ఉండదనే మాట ప్రతి నోట వినపడుతుంది. రాత్రి వేళ కరెంటు పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఫాల్ట్ వచ్చిందో తెలియక గంటల తరబడి గ్రామాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “కరెంటు లేక నిద్ర లేదు, పని లేదు” అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందచి మేళ్లచెరువు టౌన్‌కు తక్షణమే హెల్పర్, లైన్మెన్ నియామకం, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయకపోతే, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, విద్యుత్ అధికారులకు బిల్లులు వసూలు చేసే శర్ద విద్యుత్ అందించడంలో లేదని మేళ్లచెరువు వాసులు అంటున్నారు.






