రెచ్చిపోతున్న దొంగలు..బంగారం, వెండి చోరీ..

by Bhanu |   (  Updated:2025-04-26 09:57:44  IST  )

ఆలేరు పట్టణం తో పాటు మండలంలోని కొల్లూరు గ్రామంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లతో పాటు గ్రామంలో ఉండే విజయ డైరీలో శుక్రవారం రాత్రి సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి అందిన కాడికి దోచుకున్నారు.

రెచ్చిపోతున్న దొంగలు..బంగారం, వెండి చోరీ..
X

దిశ, ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలేరు పట్టణం , మండలంలోని కొల్లూరు గ్రామంలో శుక్రవారం రాత్రి తాళం వేసి ఉన్న ఇండ్లు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని దుండగులు దోపిడీ చేశారు.ఆలేరు ఎస్సై రజినీకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆలేరు పట్టణంలోని ఓం కాశి నాదం జువెలరీ షాప్‌లో ప్రొఫెసర్ పానుగంటి శంకరాచారి నిర్వహించే జువెలరీ షాప్ షట్టర్ లేపి దొంగలు చొరబడి అర్థతులం బంగారం, 15 తులాల వెండి అపహరించారు.

కొల్లూరు గ్రామంలో జనగాం సతీష్ రెడ్డి ఇంటిలో ఎవరూ లేని సందర్భాన్ని చూసిన దుండగులు తాళం పగలగొట్టి 32 వేల రూపాయల నగదు, 15 తులాల వెండిని దోచుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఎల్లంకి రవీందర్ రెడ్డి ఇంట్లోనూ తాళం పగలగొట్టి వస్తువులను చల్లచేదురం చేశారు. అంతేకాక, గ్రామంలోని విజయ డైరీలో ప్రవేశించి దొంగలు 4000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు, ఘటనాస్థలాలను పరిశీలించి, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్సై రజినీకర్ వెల్లడించారు.

Next Story