తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన తాటికాయల దీపకల ఇంట్లో దొంగతనం జరిగింది.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
X

దిశ, ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన తాటికాయల దీపకల ఇంట్లో దొంగతనం జరిగింది. ఆదివారం ఇంటి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాదుకు వెళ్లారు. సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి బీరువాను చూడగా అందులో 7 తులాల బంగారం 60 తులాల వెండి 2 లక్షల నగదు అపహరణకు గురైనట్టు గుర్తించారు. సంఘటన స్థలాన్ని యాదాద్రి ఏసీపి శ్రీనివాస్ నాయుడు స్థానిక ఎస్ హెచ్ ఓ కొండలరావు పరిశీలించారు. బాధితురాలు దీపకల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని కొండలరావు మంగళవారం రాత్రి తెలిపారు.

Next Story