సీపీఐ స‌భ‌కు భారీగా త‌ర‌లివెళ్లిన కార్య‌క‌ర్త‌లు

by Nallavelli.Anjaneyulu |

సీపీఐ 100వ వార్షికోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో నిర్వ‌హించ‌నున్న అఖిల భారత స్థాయి బహిరంగ సభకు చింతలపాలెం మండలం నుంచి సీపీఐ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు.

సీపీఐ స‌భ‌కు భారీగా త‌ర‌లివెళ్లిన కార్య‌క‌ర్త‌లు
X

దిశ‌, చింత‌ల‌పాలెం : సీపీఐ 100వ వార్షికోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో నిర్వ‌హించ‌నున్న అఖిల భారత స్థాయి బహిరంగ సభకు చింతలపాలెం మండలం నుంచి సీపీఐ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఉత్సాహంగా ఖమ్మం వైపు తరలిన కార్యకర్తలు సీపీఐ శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలనే సంకల్పంతో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, చింతలపాలెం మండల సీపీఐ కార్యదర్శి చింత్రియాల రవి మాట్లాడుతూ దేశంలో కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ ఆవిర్భావం నుంచి నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. కార్మిక హక్కులు, భూసమస్యలు, రైతాంగానికి న్యాయం, సామాజిక సమానత్వం కోసం సీపీఐ చారిత్రక ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత స్థాయి బహిరంగ సభ సిపిఐ శతాబ్ది ఉద్యమాల్లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ సభ ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలకు దిశానిర్దేశం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడమే ఈ సభ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు, గ్రామ శాఖల కార్యదర్శులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story