- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు : పీఏసీహెచ్ చైర్మన్
దిశ, తిరుమలగిరి : తిరుమలగిరి మండలంలోని అనంతరం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం

దిశ, తిరుమలగిరి : తిరుమలగిరి మండలంలోని అనంతరం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పీఎసీహెచ్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ ఆకుల వీరయ్య, ఎవో నాగేశ్వరరావు కలిసి రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి తేమతో పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాహకులు ధాన్యం ఎగుమతి, ట్రక్ షీట్ తయారీ, మిల్ అలాట్మెంట్, ఇంటి రికార్డులు వంటి అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రంలో తగిన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ జాన్ మహమ్మద్,జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్,కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సంకేపల్లి కొండల్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వై. నరేష్,మార్కెట్ డైరెక్టర్ రాపాక సోమేష్, కందుకూరి లక్ష్మయ్య, సీఈవో మహేందర్, సంకేపల్లి రఘునందన్ రెడ్డి,కృష్ణమూర్తి,రమేష్ లింగయ్య, అభిలాష్ మహేష్ పాల్గొన్నారు.






