అనుమతి లేకుండా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి..

by I. Sairam |

ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను అక్రమంగా కొట్టివేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ డిమాండ్ చేశారు.

అనుమతి లేకుండా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి..
X

దిశ, చిట్యాల: ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను అక్రమంగా కొట్టివేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో జాతీయ రహదారి నుండి గ్రామంలోకి వెళ్లే దారి వెంట ఎన్నో ఏళ్లుగా ఉన్న భారీ వృక్షాలను ఎలాంటి అనుమతి లేకుండా కొట్టివేయడంపై ఆయన నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం చిట్యాల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని రోజుల క్రితం అటవీ శాఖ అధికారుల ఇతర శాఖల అధికారుల అనుమతి లేకుండా భారీ వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేయడం పట్ల ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు విచారణ చేసి చెట్లు నరికి వేసిన వారిపై జరిమానా విధించారని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే తిరిగి చెట్లను కొట్టివేయడం పట్ల వెనుక ఉన్న అధికారుల, ప్రజాప్రతినిధుల పై పూర్తి విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story