- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలల వద్ద కోతులు, కుక్కల బెడదపై చర్యలు చేపట్టాలి
చౌటుప్పల్ మున్సిపల్ పరిధి లోని పాఠశాలల పరిసరాల్లో కోతులు, వీధి కుక్కల బెడదపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

దిశ, చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ మున్సిపల్ పరిధి లోని పాఠశాలల పరిసరాల్లో కోతులు, వీధి కుక్కల బెడదపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పాఠశాలల సమీప ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలు, పరిసర ప్రాంతాల్లో కోతులు, కుక్కల సంచారం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని, పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు.






