- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Windfall Tax: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కేంద్రం మరోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
ఈ పెంపు నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును మరోసారి పెంచింది. ఈ పెంపు నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ప్రకారం, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13.5 నుంచి రూ. 14కు పెరిగింది. ఏటీఎఫ్‌పై ఈ సుంకం రూ. 9.5 నుంచి రూ. 12.5కు పెరిగింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న రూ. 1.5 సుంకాన్ని యథాతథంగా కొనసాగించింది. దేశీయ వినియోగం కోసం విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలు లేదా వాటిపై ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఎగుమతిదారులకు అధిక లాభాల అవకాశాలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. యుద్ధ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో ఇంధన కొరత తలెత్తకుండా చూడటం, రిఫైనరీలు విదేశీ మార్కెట్లకు అధికంగా సరఫరా చేయకుండా నిరోధించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దేశీయ ఇంధన భద్రతను కాపాడటం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఎగుమతిదారులకు లభించే అదనపు లాభాలను నియంత్రించడమే ఈ విధానం లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.






