- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యాయత్నం కేసులో నిందితుడి రిమాండ్
by Ratna Kumari |
దిశ, భూదాన్ పోచంపల్లి : ఓ వ్యక్తిని బీరు సీసాతో చంపడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి

X
దిశ, భూదాన్ పోచంపల్లి : ఓ వ్యక్తిని బీరు సీసాతో చంపడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన మహమ్మద్ నవాజ్ పాత కక్షలు మనసులో పెట్టుకొని తన మేన బామ్మర్ది అయిన షేక్ నవీద్ పై సెప్టెంబర్ 19న బీరు సీసాతో చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో నవీద్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత రెండు నెలలుగా నవాజ్ ఎవరి కంటపడకుండా తప్పించుకొని తిరుగుతుండగా శుక్రవారం పోచంపల్లి పోలీసులు ఛేదించి పట్టుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుడని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించి నల్గొండ జైలుకు పంపినట్లు తెలిపారు.
Next Story






