- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక కి అబార్షన్.. స్పందించిన ఐసీడీఎస్ అధికారులు
దిశ, చిట్యాల : మైనర్ బాలికను అబార్షన్ చేయడానికి హాస్పిటల్ కి తీసుకువచ్చిన సందర్భంలో ఐసీడీఎస్ అధికారులు స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చిట్యాల

X
దిశ, చిట్యాల : మైనర్ బాలికను అబార్షన్ చేయడానికి హాస్పిటల్ కి తీసుకువచ్చిన సందర్భంలో ఐసీడీఎస్ అధికారులు స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఐసిడిఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన మైనర్ బాలిక ప్రెగ్నెన్సీ కావడంతో తన తల్లిదండ్రులు చిట్యాల లోని ప్రైవేటు క్లినిక్ కు తీసుకువచ్చారు. ఈ సమాచారం 100 కాల్ ద్వారా స్థానిక పోలీసులకు వెళ్లడంతో వెంటనే వారు అక్కడికి వెళ్లి నిర్వాహకులను, అమ్మాయిని స్టేషన్ కి తీసుకువెళ్లి విచారణ చేశారు. అనంతరం ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేసి అమ్మాయిని నల్గొండ కేంద్రంలోని సఖి కేంద్రానికి పంపించారు. అనంతరం అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు ఐసిడిఎస్ సూపర్ వైజర్ సునీత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Next Story






