వివాహానికి వెళ్లిన యువ‌కుడు మృతి

by Bhanu |   (  Updated:2025-11-28 10:54:13  IST  )

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

వివాహానికి వెళ్లిన యువ‌కుడు మృతి
X

దిశ, గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన పిన్నని అనిల్ (34) సూర్యాపేటలో నివాసం ఉండి, తన స్వగ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం గ్రామానికి వచ్చి సాయంత్రం సూర్యాపేటకు వెళ్తాడు. ఈ క్రమంలో అనిల్ గురువారం ఓ తండాలో వివాహం ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రాత్రి సమయంలో పొనుగోడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

Next Story