వైద్యం విక‌టించి కాలు కోల్పోయిన యువకుడు..!

by Nallavelli.Anjaneyulu |

బైక్ పై వెళుతున్న యువకుడు అదుపుతప్పి కింద పడిపోవడంతో కాలుకు గాయాలు కావ‌డంతో హాస్పిటల్ లో చేర్పించారు. ఇక ఆ ఆసుప‌త్రిలో వైద్యం వికటించి కాలు కోల్పోయిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.

వైద్యం విక‌టించి కాలు కోల్పోయిన యువకుడు..!
X

దిశ, హుజూర్ నగర్ : బైక్ పై వెళుతున్న యువకుడు అదుపుతప్పి కింద పడిపోవడంతో కాలుకు గాయాలు కావ‌డంతో హాస్పిటల్ లో చేర్పించారు. ఇక ఆ ఆసుప‌త్రిలో వైద్యం వికటించి కాలు కోల్పోయిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడు గత నాలుగు రోజుల క్రితం బైక్ పై వెళ్తుండగా బైకు అదుపు తప్పి కింద పడడంతో యువకుని కాలుకు గాయమై విరిగిపోయింది. దీంతో ఆ యువకుడిని కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్ పట్టణంలోని సింధు ఎముకల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తరువాత యువకునికి ఆసుప‌త్రిలో ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన యువకునికి కాలు వాపు రావడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ యువకునికి కాలులో నరం కట్ అవ్వడం వలన మోకాలు నుంచి కింది భాగమంతా కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే కాలు తీసివేయకపోతే శరీరమంతా ఇన్ఫెక్షన్ అయి ఆ యువకుడు ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పడంతో డాక్టర్ల సూచన మేరకు ఆ యువకుని కాలు తీసివేశారు. దీంతో దీనన్నింటికి కారణం హుజూర్ నగర్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేసిన సమయంలో డాక్టర్లు సక్రమంగా వైద్యం చేయకపోవడం వలన యువకుడికి కాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తించిన యువకుని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పటల్ వద్దకు చేరి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story