- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. న్యాయం చేయాలని నిరసన
దిశ, తిరుమలగిరి : మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. దీంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన పై న్యాయం

దిశ, తిరుమలగిరి : మండల పరిధిలోని తొండ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. దీంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన పై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మృతుడి బంధువులు, గ్రామస్థులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాస్తారోకో విరమించేది లేదంటూ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న నాగారం సీఐ నాగేశ్వరరావు, తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. ఆందోళనకారులు వినకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాస్తారోకో కారణంగా కొంతసేపు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దళిత సంఘాల నేతల మద్దతు
ఈ రాస్తారోకో కి దళిత సంఘాల నేతలు, బహుజన యుద్ధనౌక ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. “ప్రమాదం పేరుతో నిర్లక్ష్యం చేయడం సహించేది లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది” అని వారు స్పష్టం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు బయటకు రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి పై పోలీసుల నిఘా
పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని, కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తిరుమలగిరి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ మరింత ఉధృతంగా మారింది.






