డివైడర్‌ను ఢీ కొని యువకుడి దుర్మరణం

by Nallavelli.Anjaneyulu |

డివైడ‌ర్ ను ఢీ కొని యువ‌కుడు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న కోదాటడ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.

డివైడర్‌ను ఢీ కొని యువకుడి దుర్మరణం
X

దిశ‌, కోదాడ : డివైడ‌ర్ ను ఢీ కొని యువ‌కుడు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న కోదాటడ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఏసు పంగు గౌతం (17) తన స్నేహితుడిని కర్ల సంతోష్ ని కూర్చోబెట్టుకొని బైపాస్ రోడ్డులోని ఫిల్టర్ కాఫీ వద్ద కాఫీ తాగేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో రంగా థియేటర్ చౌరస్తా వద్దకు రాగానే తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై జారిపడి సమీపంలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో గౌతమ్ ను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం గౌతమ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Next Story