- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగం పోయిందనే బాధతో యువకుడు ఆత్మహత్య
ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

దిశ, చౌటుప్పల్ టౌన్: ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. చెవగోని మనోజ్ (26) అనే యువకుడు 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. చౌటుప్పల్ సీఐ జి. మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ధర్మోజీగూడెం గ్రామానికి చెందిన చెవగోని దశరథకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ హైదరాబాద్ లో ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. ఇంటికి పెద్దకుమారుడైన మనోజ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతన్ని సదరు యాజమాన్యం పని లోనుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనస్తపానికి గురైన మనోజ్ గత 31 న మధ్యాహ్నం ధర్మోజీగూడెంలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటికే వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పడుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో మనోజ్ వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు గమనించి ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగంలోంచి తీసేశారు. అందుకే ఎలుకల మందు తాగానని చెప్పాడు. దీంతో కంగారు పడిన దశరథ హుటాహుటిన మనోజ్ ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోజ్ పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మెరుగైన చికిత్ల కోసం వెంటనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ మనోజ్ శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. మృతుని తండ్రి దశరథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మన్మథకుమార్ తెలిపారు.






