ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. ఇంతకీ ఏ చేశాడో తెలుసా..?

by Naveena |

కోతుల బెడద రైతులకు తప్పడం లేదు.

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. ఇంతకీ ఏ చేశాడో తెలుసా..?
X

దిశ, నూతనకల్ : కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు. అడవిలో ఉండాల్సిన కోతులు.. జనావాసాలు, రోడ్లు, పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయి. రైతుల పంట పొలాలను నాశనం చేస్తూ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో కోతులను తరిమెందుకు ఓ రైతు వినూత్న ప్రయత్నం చేశారు. మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన రైతు నేలమర్రి నగేష్ ఏడు వేల రూపాయలతో జీవం లేని పెద్దపులి బొమ్మను కొనుగోలు చేశారు. ప్రతిరోజు దానిని నెత్తిమీద పెట్టుకుని పొలం చుట్టూ తిరగడంతో కోతులు పారిపోతున్నాయని అన్నారు. దీంతో చాలా వరకు పంటను కాపాడుకుంటున్నానని రైతు పేర్కొన్నారు.

Next Story