కాలువలో దూకి గృహిణి ఆత్మహత్యాయత్నం

by Ratna Kumari |   (  Updated:2025-12-27 14:32:37  IST  )

దిశ, హాలియా : కుటుంబ కలహాలతో గృహిణి సాగర్ ఎడమకాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన

కాలువలో దూకి గృహిణి  ఆత్మహత్యాయత్నం
X

దిశ, హాలియా : కుటుంబ కలహాలతో గృహిణి సాగర్ ఎడమకాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం హాలియాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన మద్దూరి ప్రేమలత (30) శనివారం ఉదయం పోతునూరు నుంచి ఆర్టిసి బస్సు ఎక్కి హాలియా పోలీస్ స్టేషన్ వద్ద దిగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ సాగర్ ఎడమ కాలువ క్రస్ట్ గేట్ల వెనుక భాగాన ఉన్న‌ కాల్వలో దూకింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది కూలీలు గమనించి మహిళను కాపాడారు. మహిళ అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది మహిళను అంబులెన్స్ లోనే ప్రాథమిక చికిత్స అందిస్తూ ప్రాణాలకు ప్రమాదం లేకుండా సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. మహిళ ప్రాణాలతో బయటపడేందుకు చికిత్స అందించిన 108 సిబ్బంది షేక్ గౌస్ పాషా, బొడ్డుపల్లి శివలను బంధువులు అభినందించారు.

Next Story