బండి సంజయ్ కి ఘనస్వాగతం..

by Disha Web Desk 20 |
బండి సంజయ్ కి ఘనస్వాగతం..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను చౌటుప్పల్ లో ఆ పార్టీ కార్యకర్తలు శనివారం ఘనస్వాగతం పలికారు. బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించనున్న నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న బండిసంజయ్ చౌటుప్పల్ లో కొద్దిసేపు ఆగి స్థానిక గట్టు శ్రీ రాములు గార్డెన్ కు వెళ్లారు. ఆ పార్టీ సీనియర్ కార్యకర్త జతిన్ ముఖర్జీ కుటుంబసభ్యులు చేస్తున్న బారసాల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.

బండిసంజయ్ ని స్వాగతించిన వారిలో బీజేపీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఊడుగు వెంకటేశం గౌడ్, దాసోజు బిక్షమాచారి, బత్తుల జంగయ్య గౌడ్, పంతంగి గ్రామ సర్పంచ్ భాతరాజు సత్యం, మునగాల తిరుపతిరెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఏసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాధారపు సత్తయ్య, కాసుల వెంకటేశం గౌడ్, లగ్గోని పాండు, భాస్కర్, పబ్బు వంశీ, ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Next Story