- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఐ సీనియర్ నేతకు నివాళి
by Ratna Kumari |
రాజపేట మండలంలో బేగంపేట గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకులు పాపమ్మల నరసయ్య మృతి చెందాడు.

X
దిశ, రాజాపేట : రాజపేట మండలంలో బేగంపేట గ్రామంలో సీపీఐ సీనియర్ నాయకులు పాపమ్మల నరసయ్య మృతి చెందాడు. శనివారం సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పాపం నరసయ్య పార్టీవ దేహానికి ఎర్ర కండువా కప్పి జోహార్లతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం మాట్లాడుతూ నరసయ్య లేని లోటు సీపీఐ కి తీరని లోటు అన్నారు. పార్టీ లో ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి మూలపోచయ, ఏటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాబు పేట వెంకటయ్య, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి మూల హరినాథ్, దేవి సత్తయ్య, సీనియర్ నాయకులు జిల్లా వెంకటయ్య, జిల్లా బాలరాజు, గుర్రం రాములు, మానుపాటి శ్రీను పాల్గొన్నారు.
Next Story






