కుంకుడు కాయ రైతుల‌కు స్థిర‌మైన ఆదాయం

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని పొలేపల్లి గ్రామంలో ప్రగతిశీల రైతు శ్రీ లోకసాని పద్మారెడ్డికి సంబంధించిన కుంకుడు కాయ తోట‌ను సూర్య‌పేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల రైతులు ప‌రిశీలించారు.

కుంకుడు కాయ రైతుల‌కు స్థిర‌మైన ఆదాయం
X

దిశ‌, చందంపేట : మండ‌ల ప‌రిధిలోని పొలేపల్లి గ్రామంలో ప్రగతిశీల రైతు శ్రీ లోకసాని పద్మారెడ్డికి సంబంధించిన కుంకుడు కాయ తోట‌ను సూర్య‌పేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల రైతులు ప‌రిశీలించారు. అనంత‌రం కేవీకే గ‌డ్డిప‌ల్లి ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌ద్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లోక‌సాని ప‌ద్మారెడ్డి మాట్లాడుతూ కుంకుడు కాయ రైతుల‌కు స్థిర‌మైన ఆదాయం ల‌భిస్తుంద‌ని తెలిపారు. త‌క్కువ పెట్టుబ‌డితోనే స్థిర‌మైన ఆదాయం పొందాలంటే కుంకుడుకాయ వంటి పంట‌ల‌ను పండించాల‌ని సూచించారు. ఒక‌సారి తోట‌ను ఏర్పాటు చేసిన త‌రువాత వార్షిక ఆదాయం ల‌భిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న కుంకుడు కాయ నుంచి షాంపు, హెయిర్ వాష్, లిక్విడ్ క్లీన‌ర్, డిట‌ర్జెంట్, ఆయుర్వేద ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చ‌ని వివ‌రించారు. గ్రామీణ స్థాయిలో రైతులు చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు, మ‌హిళా స్వ‌యం స‌హాయక సంఘాల ద్వారా ఉపాధి అవ‌కాశాలు సృష్టించాల‌ని.. మార్కెటింగ్ విధానాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేవీకే గ‌డ్డిప‌ల్లి ఉద్యాన‌వ‌న శాస్త్ర‌వేత్త‌లు సీ.హెచ్. న‌రేష్, డా. పి.అక్షిత్ సాయి పాల్గొన్నారు.

Next Story