పైసా పోయే.! పరువు పోయే..!!

by velandi.Saikiran |   (  Updated:2025-12-12 21:16:07  IST  )

జయం సాధించిన కొంతమంది ఓవైపు ఉత్సాహంతో ఉన్నప్పటికీ చే

పైసా పోయే.! పరువు పోయే..!!
X

పైసా పోయే.! పరువు పోయే..!!

అప్పులు మిగిలే...!!!

కుమిలిపోతున్న ఓటమి అభ్యర్థులు

దిశ,తుంగతుర్తి: పైసా పోయే.! పరువు పోయే..!! చివరికి అప్పులే మిగిలే...!!! అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు ఏం చేయాలో ..? తోచక లోలోన కుమిలిపోతున్నారు.తానొకటి తలిస్తే... దైవమొకటి తలంచెనే అనే చందాగ మన పరిస్థితి ఉందంటూ కళ్ళు తేలేస్తున్నారు.పైగా పెట్టిన ఖర్చులన్నీటిని లెక్కగట్టి బావురుమంటున్నారు.నామినేషన్ల గడువు పూర్తయిన నాటి నుంచి మొదలుకొంటే పోలింగ్ రోజు పూర్తయ్యే వరకు ఖర్చులకు వెనకాడకుండా ఓటర్లను మచ్చిక చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.ప్రతిరోజు మద్యం,చికెన్,బిర్యానీలు పంచడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే పోటీతత్వం పెరిగిపోవడంతో ఓటు విలువ పరిస్థితులను బట్టి రూ.రెండు నుండి రూ.మూడు వేలకు చేరింది.

తుంగతుర్తి నియోజకవర్గంలో నూతనకల్,మద్దిరాల, తుంగతుర్తి,అర్వపల్లి,నాగారం,తిరుమలగిరి మండలాలు ఉన్నాయి.వీటన్నింటిలో కలిపి 104 గ్రామ పంచాయతీలు,948 వార్డులు ఉన్నాయి..ఈ మేరకు ఆయా గ్రామాల రిజర్వేషన్ బట్టి స్థానికంగా ఉంటున్న పలువురు పోటీకి సై అన్నారు.అంతేకాకుండా జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ఏర్పడడంతో స్వగ్రామాలకు చేరి పోటీలో నిలుచున్నారు.కాంగ్రెస్ లో రెండు వర్గాలతో పాటు బీజేపీ,బీఆర్ఎస్,రెబల్స్,తదితర పార్టీలకు చెందిన వారు ఈ పోటీలో ఉన్నారు.ఒక వీరంతా గెలవడానికి నామినేషన్ల గడువు పూర్తయిన నాటి నుండి మొదలుకొంటే పోలింగ్ రోజు పూర్తయ్యే వరకు ఖర్చులకు వెనకాడకుండా ఓటర్లను మచ్చిక చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.ప్రతిరోజు మద్యం,చికెన్,బిర్యానీలు పంచడం మొదలుపెట్టారు.అందులో కొంతమందికి ఖరీదైన మందు కూడా ఉండడం విశేషం.

ఇది ఇలా ఉంటే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది.కొంతమంది అయితే చేతిలో ఉన్న సొంత నగదు తో పాటు ఇరుగుపొరుగు ద్వారా తెచ్చిన అప్పులు కూడా సరిపోకపోవడంతో ఒంటి మీదున్న బంగారు నగలను సైతం బ్యాంకుల్లో కుదవ పెట్టడం లేదా అమ్మకాలు చేయడం లాంటివి కూడా చేశారు.ఇక ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఖర్చులకు వెనకాడకుండా స్వగ్రామాలకు రప్పించుకోవడంతోపాటు ఓటు వేసి తిరిగి వెళ్లడం,మధ్యలో ఒక్కొక్క ఓటుకు రూ.ఒక వెయ్యి వరకు ఇవ్వడం లాంటివి జరిగాయి.కొంతమంది అయితే పోటీతత్వం పెరిగిపోవడంతో ఓటు విలువ పరిస్థితులను బట్టి రూ.రెండు నుండి రూ.మూడు వేలకు చేరింది.దీనికి అదనంగా మందు సీసాలు.ఈ లెక్కన ఒక ఇంట్లో మూడు ఓట్లు ఉంటే రూ.పదివేలకు పైగా ఇచ్చిన వారు కూడా ఉన్నారు.ఇలా అనేక గ్రామాలలో ఖర్చు 10 నుండి 20 లక్షల పైబడి చేరినట్లు ఒక అంచనా.అనంతరం ఓట్ల లెక్కింపు సమయంలో వస్తున్న ఫలితాలతో ఓటమి చెందుతున్న వారంతా నిరాశతో వెళ్లిపోయారు.ఇంత ఖర్చు పెట్టినా... గెలవ లేకపోయాం..అనే బాధలో ఉంటే అనుచరులు సదరు అభ్యర్థిని ఓదార్చడం కష్టతరమైంది.అనంతరం ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాం..అంటూ లెక్కలు తీస్తూ కంగుతిన్నారు.

గెలిచిన వారిలో సంతోషాలు బాధలు

ఎన్నికల్లో సర్వం పోగొట్టుకున్న వారంతా బాధల్లో ఉంటూ తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మీమాంసలో పడిపోయారు.ఇక విజయం సాధించిన కొంతమంది ఓవైపు ఉత్సాహంతో ఉన్నప్పటికీ చేసిన ఖర్చులు భయపెడుతున్నాయి.ఖర్చుపెట్టిన డబ్బును ఎలా సంపాదించాలి..? మీ మాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.

Next Story