మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి షాక్..!

by Nallavelli.Anjaneyulu |

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. డీసీసీబీ డైరెక్టర్, మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరారు.

మున్సిపల్ ఎన్నికల వేళ  బీఆర్ఎస్ కి షాక్..!
X

దిశ, చండూరు : మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్, చండూరు రైతు సేవ సహకార సంఘం మాజీ చైర్మన్ కోడి సుష్మ ఆమె భర్త చండూరు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పుంజుకున్నట్లు అయింది. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కోరిమి ఓంకారం, అనంత చంద్ర శేఖర్,కోడి గిరి బాబు, కోడి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Next Story