నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని క‌లెక్ట‌ర్ కి విన‌తి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-05 14:59:58  IST  )

చందంపేట మండలంలోని యల్మలమంద గ్రామపంచాయతీలోని నాలుగు తండాల‌ను స‌ప‌రేట్ గ్రామ‌పంచాయ‌తీ చేయాల‌ని క‌లెక్ట‌ర్ కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని  క‌లెక్ట‌ర్ కి విన‌తి
X

దిశ, చందంపేట : చందంపేట మండలంలోని యల్మలమంద గ్రామపంచాయతీలోని నాలుగు నూతన గ్రామపంచాయతీలుగా విభజించి ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు కేతావ‌త్ రమేష్ నాయక్, కేతావ‌త్ నెహ్రూ నాయక్, కేతావ‌త్ గోపాల్ నాయక్, బానావత్ సుక్య నాయక్ సోమవారం నల్గొండ కలెక్టర్ బ‌డుగుల చంద్ర‌శేఖ‌ర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా కలిగిన‌ తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని.. ప్రత్యేక జీవో తెచ్చి చాలా గిరిజన తండాలు గ్రామపంచాయతీలు గా ఏర్పడిన కూడా మా గ్రామం లో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు కాకపోవడం చాలా బాధగా ఉందని వారు పేర్కొన్నారు. మా గ్రామపంచాయతీల లో 7 ఆవాస తండాలు ఉన్నాయని.. అవి కూడా గ్రామపంచాయతీ హెడ్ క్వార్ట‌ర్స్ నుంచి ఎటు చూసినా 5 కిలోమీటర్ల దూరములో ఉన్నాయని.. అప్పటి అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు అందించిన అధికారుల నిర్లక్ష్యంతో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడలేదని వారన్నారు. గ్రామపంచాయతీలోని ఓటర్ల సంఖ్య 1751 ఉన్నాయని వెంటనే జిల్లా అధికారులు పర్యవేక్షణ చేసి పరిశీలించి నూతన గ్రామ పంచాయతీకి అర్హత ఉన్న తండాలను గ్రామపంచాయతీలు గా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరారు.

Next Story