- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూటీ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు
స్కూటీ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం పట్టణంలోని సాగర్ రోడ్డు పై జరిగింది.

X
దిశ, మిర్యాలగూడ: స్కూటీ అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం పట్టణంలోని సాగర్ రోడ్డు పై జరిగింది. యాద్గార్ పల్లి గ్రామానికి చెందిన గువ్వల శివ తన స్కూటీ పై వస్తున్న క్రమంలో అదుపు తప్పి అంబేద్కర్ విగ్రాహానికి ఏర్పాటు చేసిన ఇనుప మెట్లను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శివ తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం అతడిని హైద్రాబాద్ కి తరలించారు. ఇనుప మెట్లలోకి స్కూటీ ఇరుక్కున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Next Story






