రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!

by Geesa Chandu |

ఆగి ఉన్న డీసీఎం ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన, ఆదివారం తెల్లవారుజామున మండలంలోని శెట్టిపాలెం రైస్ మిల్లుల సమీపంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!
X

దిశ, వేములపల్లి: ఆగి ఉన్న డీసీఎం ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన, ఆదివారం తెల్లవారుజామున మండలంలోని శెట్టిపాలెం రైస్ మిల్లుల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మహర్షి రైస్ మిల్లు సమీపంలో డీసీఎం పార్కింగ్ చేసి పెట్టారు. కాగా బాపట్ల నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story