వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష.. అసలు విషయం ఏంటో తెలుసా..?

by Naveena |
వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష.. అసలు విషయం ఏంటో తెలుసా..?
X

దిశ, నల్లగొండ క్రైం: ఓ గిరిజన మహిళపై హత్యాయత్నం చేసినందుకు నేరస్తుడికి 20ఏండ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజారమణి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన ఓ మహిళ 2007లో దేవరకొండకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు మధ్య మనస్పదర్ధలు రావడంతో.. 2018 నుంచి తల్లిగారి ఉరైనా దామెరలో కూలిపని చేసుకుంటూ నివసిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బచ్చనబోయిన (పిట్టల) మహేష్ అనే వ్యక్తి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు.

అక్టోబర్ 13న 2018న బాధిత మహిళ అన్నం తిని నిద్రిస్తుండగా.. మహేశ్ వచ్చి బలవంతంగా, పక్కనే ఉన్న పత్తిచేనులోకి గుంజుకునిపోయాడు. వెంట తెచ్చుకున్ని యాసిడ్ ను ఆమెపై పోసి హత్నాయత్నం చేసినట్లు బాధితురాలు మరుసటి రోజు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి దేవరకొండ డీఎస్పీ ఎస్. మహేశ్వర్, ఆదేశాలమేరకు, నాంపల్లి ఎస్ఐ డి.విజయ్ కుమార్ వివారాలు సేకరించి 2019లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు వాయిదాలపై నడుస్తూ వస్తూ, బుధవారం ఫైనల్ కు వచ్చింది. ప్రస్తుత నాంపల్లి ఎస్ఐ ఎం.శోభన్ బాబు సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి, నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో.. హత్యాయత్నం చేసినందుకు 10ఏండ్లు, రూ.1000 జరిమానా, యాసిడ్ దాడికి యత్నించినందుకు మరో 10ఏండ్లు, రూ.1000 జరిమానా విధించారు.

Next Story