- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..!
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి - చిట్యాల ప్రధాన రహదారి పై భువనగిరి బైపాస్ బ్రిడ్జి పై నుండి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు భువనగిరి పట్టణం బహార్ పేటకు చెందిన బానుక సంతోష్ గా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఒక బాబు ఉన్నారు. మృతుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






