- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాయకుడికి నిబద్ధత చాలా అవసరం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
దిశ, చిలుకూరు : ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాలు, వాటి అమలు పై నాయకులకు నిబద్ధత అవసరం అని, ఆ కోవలోకి చేరిన

దిశ, చిలుకూరు : ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాలు, వాటి అమలు పై నాయకులకు నిబద్ధత అవసరం అని, ఆ కోవలోకి చేరిన నాయకుడే కస్తూరి నరసయ్య అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆయన బుధవారం చిలుకూరులో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కస్తూరి నరసయ్య సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి నరసయ్య చేసిన సేవలు మరచిపోలేనివని ఆయన అన్నారు. నర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్లయ్య యాదవ్ బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ఈ సభలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏ జానకిరామాచారి, ప్రధాన కార్యదర్శి అంబాల రాంబాబు, చిలుకూరు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగేశ్వరరావు, ప్యాక్స్ మాజీ ఛైర్మన్ అలసకాని జనార్ధన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు షేక్ జానిమియా, మాజీ ఎంపీపీ కొండా అన్నపూర్ణ, డా.జాస్తి సుబ్బారావు, కస్తూరి సైదులు, పుట్టపాక అంజయ్య, కస్తూరి రాములు, పీ గంగాధర్ రావు, అనంతారపు కృష్ణయ్య, అంబాల వెంకటేశ్వర్లు, అఖిలపక్ష పార్టీల సభ్యులు పాల్గొన్నారు.






