జాతీయ జెండాకు ఘోర అవమానం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కోదాడ : కోదాడ జాతీయ రహదారి 365పై హైవే కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. దేశ గౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండాను

జాతీయ జెండాకు ఘోర అవమానం
X

దిశ‌, కోదాడ : కోదాడ జాతీయ రహదారి 365పై హైవే కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. దేశ గౌరవానికి ప్రతీక అయిన జాతీయ జెండాను అవమానించే రీతిలో రహదారిపై గురువారం పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జాతీయ రహదారిపై జీబ్రా క్రాసింగ్ అమలు పేరుతో కాంట్రాక్టర్ వాహనాల చుట్టూ, పనుల కోసం ఉపయోగిస్తున్న పరికరాలపై జాతీయ జెండాలను అమర్చడం దేశభక్తుల మనోభావాలను దెబ్బతీసింది. జాతీయ జెండాను ట్రాఫిక్ నియంత్రణ సాధనంగా వినియోగించడం చట్ట విరుద్ధమే కాకుండా, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాకు ఉన్న గౌరవం, మర్యాద గురించి కనీస అవగాహన లేకుండా కాంట్రాక్టర్ ఇలా వ్యవహరించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగాస్థానికులు అభిప్రాయపడుతున్నారు. రహదారి పనుల్లో భద్రతా సూచికలు, బ్యారికేడ్లు, సైన్‌బోర్డులు వినియోగించాల్సిన చోట జాతీయ జెండాలను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత హైవే అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ జెండా అవమానానికి పాల్పడిన కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదని, ముఖ్యంగా ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్లు జాతీయ చిహ్నాల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story