చండూరులో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి

by Naveena |

నూతనంగా ఏర్పాటైనా చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

చండూరులో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
X

దిశ, చండూరు : నూతనంగా ఏర్పాటైనా చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం చండూరులో ఆయన మాట్లాడుతూ.. చండూరు రెవిన్యూ కేంద్రం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, హోటల్లు, బౌల అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయానికి కేంద్రంగా ఉందన్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం అవుతున్న సందర్భంలో, అప్పటికే విలువైన ఆస్తులు కాలి బూడిద అయ్యే అవకాశం ఉందన్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడ ఉంటుందని అన్నారు. చండూరులో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే, చండూరుతో పాటుగా మునుగోడు, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడెం, నాంపల్లి మండలాల ప్రజలకు మేలు జరిగి అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆలోచించి వెంటనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Next Story