వారెవ్వా!.. మిర్చి తోటకు ఏకంగా సన్నిలియోన్ నే కాపలా పెట్టిన రైతు

by Javid Pasha |   (  Updated:2022-12-03 15:39:24  IST  )

ఓ రైతు తన మిర్చి తోటకు కాపలాగా ఏకంగా బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ నే పెట్టాడు.

వారెవ్వా!.. మిర్చి తోటకు ఏకంగా సన్నిలియోన్ నే కాపలా పెట్టిన రైతు
X

దిశ ప్రతినిధి, సూర్యాపేట: ఓ రైతు తన మిర్చి తోటకు కాపలాగా ఏకంగా బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ నే పెట్టాడు. ఈ క్రమంలోనే రైతుకు చెందిన పచ్చటి మిర్చి తోటలో సన్నిలియోన్ హాట్ హాట్ గా దర్శనమిస్తోంది. సన్నిలియోన్ ఏంటీ.. సూర్యాపేటకు రావడం ఏంటీ అని అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. జిల్లాలోని నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు ఏపుగా పెరిగిన తన మిర్చి తోటకు దిష్టి తగలకుండా ఉండటానికి వినూత్నంగా ఆలోచించాడు. మామూలుగా అయితే ఇందుకోసం ఓ బొమ్మను తయారు చేసి చేను మధ్యలో ఉంచుతారు. కానీ ఈ రైతు అందుకు భిన్నంగా బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ ఫ్లెక్సీని చేనులో ఏర్పాటు చేశాడు. ఏపూరు మిర్యాల ప్రధాన రహదారి వెంట మిర్యాల గ్రామ సమీపంలోని మిరప తోటలో ఏర్పాటు చేసిన సన్నిలియోన్ ఫ్లెక్సీ.. దారెంట వెళ్లే ప్రయాణికులను కట్టిపడేస్తోంది.


ఈ ఫ్లెక్సీలో హాట్ హాట్ గా కనిపిస్తున్న సన్నిలియోన్ అందానికి యువకులు ముగ్దులైపోతున్నారు. ఇంకేముంది వచ్చిపోయేటోళ్లంతా తన చేను వైపు చూడకుండా హాట్ బ్యూటీ సన్నిలియోన్ వైపు చూస్తున్నారని సదరు రైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సారి మిర్చి తోట ఏపుగా కాసిందని, చూసినవాళ్లంతా ఈర్ష్యపడుతున్నారని రైతు చెప్పాడు. వారి దృష్టిని మరల్చడానికే సన్నిలియోన్ ఫ్లెక్సీ పెట్టానని సదరు రైతు చెబుతున్నాడు. అయితే పచ్చటి తోటలో ఈ బూతు బొమ్మలేంటని కొంతమంది మహిళలు సదరు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తన ఐడియా వర్కవుట్ కావడంతో సదరు రైతు మస్త్ ఖుషి అవుతుండు.

Next Story