బత్తుల లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాలపై సీడీ విడుదల

by Dishafeatures2 |
బత్తుల లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాలపై సీడీ విడుదల
X

దిశ, వేములపల్లి : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి చేసే కార్యక్రమాలపై బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ సీడినీ ఆవిష్కరించారు. మండలంలోని ఆమనగల్లు గ్రామం పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్యకర్తలు రూపొందించిన సీడీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 26 నుంచి నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్, మండల పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, రేగట్టి రవీందర్ రెడ్డి, సర్పంచ్ వల్లంపట్ల ఝాన్సీ ప్రవీణ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పుట్టల శ్రీను, చొక్కయ్య గౌడ్, మాజీ ఎంపిటిసి కోల యశోద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed